ఎంపీ అవినాష్ కు సీబీఐ నోటీసు.. తిరస్కరించిన ఎంపీ ?
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయ పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతోపాటు, మరికొందరు ముఖ్య అధికారులు గురువారం పులివెందులకు చేరుకున్నారు. విచారణకు రావాలని అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు కడప జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కోర్టు అనుమతి తీసుకుని శుక్రవారం మరోసారి నోటీసు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.