NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ వివేక ఇంటికి సీబీఐ..ఆస‌క్తిరేపుతున్న విచార‌ణ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మాజీమంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇంటిని సీబీఐ అధికారులు మ‌రోసారి ప‌రిశీలించారు. వివేకా హ‌త్యకేసులో సీబీఐ విచార‌ణ 50వ రోజు కొన‌సాగింది. విచార‌ణ‌లో భాగంగా ఆరుగురితో కూడిన సీబీఐ బృందం పులివెందుల చేరుకుంది. వైఎస్ వివేకా ఇంటిని మ‌రోసారి సీబీఐ అధికారులు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. వైఎస్ వివేక ఇంటి వాచ్ మెన్ రంగ‌న్న ఇటీవ‌ల జ‌మ్మల‌మ‌డుగు మెజిస్ట్రేట్ వ‌ద్ద వాంగ్మూలం న‌మోదు చేశారు. అప్పటి నుంచి వైఎస్ వివేకా హ‌త్య కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పటి వ‌ర‌కు క‌డ‌ప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో విచార‌ణ జ‌రిపిన సీబీఐ బృందం..ఈరోజు పులివెందుల‌లో విచార‌ణ జ‌రిపింది.

About Author