సీబీఎస్సీ పదవ తరగతి ఆల్ ఇండియా టాపర్ కు మెమొంటోతో సన్మానం
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: ఇటీవల విడుదలైన సిబిఎస్సి పదవ తరగతి ఫలితాలలో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించిన లాస్య రెడ్డికి స్థానిక టీచర్స్ ఫెడరేషన్ మెమొంటో అందజేసి సన్మానించారు. పత్తికొండ పట్టణానికి చెందిన టీచర్ చంద్రశేఖర్ రెడ్డి , శిరీష దంపతుల కుమార్తె అయిన చిరంజీవి లాస్యకు సీబీఎస్సీ పదవ తరగతి ఫలితాల్లో 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించింది. అలాగే ఆల్ ఇండియాలో థర్డ్ ర్యాంకును కైవసం చేసుకున్నందుకు పత్తికొండ కీర్తినీ దేశమంతా చాటినందుకు పత్తికొండ మండలం రాష్ట్ర ఉపాద్యాయ సంఘం నాయకులు వారి ఇంటికి వెళ్లి లాస్య రెడ్డికి శాలువా కప్పి, మెమెంటోన్ అందజేసి హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేశారు. మున్ముందు విద్యార్థిని లాస్య మరిన్ని ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు స్టేట్ కౌన్సిలర్స్ సత్యనారాయణ , కుంపటి నారాయణ,మండల అధ్యక్ష కార్యదర్శులు బలరాం ,చంద్రశేఖర్, కృష్ణమూర్తి, ఆర్థిక కార్యదర్శి మారుతి తదితరులు పాల్గొన్నారు.