PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి : డి రాజా సాహెబ్

1 min read

– పత్తికొండ ఎండిఓ కవిత కి వినతిపత్రం యిచ్చిన సిపిఐ

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: భూ పోరాటం ద్వారా  సాధించుకున్న పేదలక ఇంటి స్థలాలలో ఏర్పాటు చేసుకున్న సిపిఐ కాలనీలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కవితకి మెమోరాండం అందజేశారు. సిపిఐ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా పేదల కోసం ఇళ్ల స్థలాల కై పోరాటాలు సలిపి ఏర్పాటు చేసుకున్న  కాలనీలలో కనీస వసతులు సిసి రోడ్లు, డ్రైనేజీ  కాలువలు, తాగునీటి వసతి లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఎంపీడీవోకు వివరించారు. ఇప్పటికైనా సిపిఐ కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, దళిత కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురుదాస్, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం తాలూకా గౌరవ అధ్యక్షులు కారన్న, రైతు సంఘం తాలూకా అధ్యక్షులు పెద్ద ఈరన్న ఎంపీడీవోను కోరారు. అనంతరం డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో పేదల కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. పత్తికొండ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి, తద్వారా పేదల కోసం స్థలాలను ఆక్రమించి ఆక్రమణ చేసి పట్టణంలోని పేదవారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. పేదలు వారికి కేటాయించిన స్థలాలలో గుడిసెలు, ఇల్లు నిర్మించుకొని  వీకే ఆదినారాయణ రెడ్డి నగర్.దిడ్డి చేను కాలనీ, పార్వతి కొండ కాలనీ, నల్లగుట్ట కాలనీలలో గత 15 సంవత్సరాలుగా దుర్భర జీవనం గడుపుతున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గము నుండి గెలుపొందిన పాలకులు ఈ కాలనీలో కనీస వసతులు ఏర్పాటు చేయడంలో పక్షవాత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో ఈ కాలనీల రోడ్లలో మోకాలు లోతు గుంతలు ఏర్పడి బయటకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. కాలానుగుణంగా మురికి గుంతలు ఏర్పడి దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు అంటూ వ్యాధులతో కాలనీవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సిపిఐ కాలనీలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా కాలనీవాసులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విడ్డూరం అన్నారు. పట్టణంలో అనేక ప్రాంతాలలో ప్రజల నివాసం లేని రియల్ ఎస్టేట్ వెంచర్లలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వసతులు ఏర్పాటు చేస్తున్నారు తప్ప పేదలు ఉండే కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా మండల అభివృద్ధి అధికారులు స్పందించి పత్తికొండ వారు ప్రాంతాల్లో  ఉన్న కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, అలా కాని ఎడల మున్ముందు ఆయా కాలనీవాసులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహయ కార్యదర్శి ఎం శ్రీనివాసులు, వి కె నగర్ కాలనీ శాఖ కార్యదర్శి శంకర్, పార్వతి కొండ కాలనీ కార్యదర్శి నాగేంద్ర, దిడ్డిచేను కాలనీ శాఖ కార్యదర్శి రవి, సిపిఐ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author