ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : మానవతా కారిడార్ కొనసాగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకరించాయి. ఉక్రెయిన్‌లోని ఎనర్‌హోడార్, కీవ్, చెర్నిహీవ్ వంటి పట్టణాలతోపాటు, పలు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అలాగే ఆహారం, వైద్య సేవలు కూడా అందుతాయని ఉక్రెయిన్ ప్రకటించింది.