PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

103వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: అక్టోబర్ 31న ఏఐటీయూసీ 103 వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురాం మూర్తి,కార్యదర్శి రమేష్ బాబు లు పిలుపునిచ్చారు.శనివారం పట్టణంలోని కార్మికులతో కలిసి ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం అని 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధాని ముంబాయి నగరంలో పురుడు పోసుకున్నదని మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జన ల నుండి ఏఐటీయూసీ ఆవిర్భవించిందని వారు అన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జన కొరకు పోరు కలిపిన మొనగాడి సంఘం కార్మిక హక్కుల కొరకు జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం అలుపెరగని పోరాటాలు చేసి కార్మిక వర్గం నేడు అనుభవిస్తున్న సౌకర్యాలను అమల్లో ఉన్న చట్టాలను ఎన్నిటినో సాధించింది ఏఐటీయూసీ అని అన్నారు . నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక రాజకీయ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేయడంలో రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను కుదించుకుపోతుంది. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పై మునుపెన్నడూ లేని రీతిలో దాడులు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకరణ ఆర్ధిక విధానాలకు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయానికి ఎఫ్ డిఐ వంటి వాటికి వ్యతిరేకంగామ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పెట్టుబడిదారులకు ఇప్పటివరకు కలగా ఉన్న కార్మిక చట్టాలు మార్పు పైన మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించింది అని ఉద్యోగుల నియామకం తొలగింపులో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు దారాదత్తం చేసే నిర్ణయాలు చేసిందని వారు విమర్శించారు. భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను రూపుమాపి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం చాలా దారుణం అని వారు అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని వారు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. అక్టోబర్ 31న ఏఐటీయూసీ 103వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కార్మికులకు వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో పట్టణ ఏఐటీయూసీ నాయకులు నాగేంద్ర, నాగేశ్వరావు, థామస్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author