బీసీల రాజ్యాధికార రథయాత్రను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బీసీల రాజ్యాధికార సాధనకోసం చేపట్టిన రథయాత్రను జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణం లోని జై కిసాన్ పార్క్ లో ఏర్పాటు చేసిన పత్రిక మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లం మహేష్ రెడ్డి బీసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగభాగమైన బీసీలకు 90 ఎమ్మెల్యే స్థానాలు, 13 ఎంపీ స్థానాలు అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ కోసం మరో స్వసంత్ర పోరాట రథయాత్ర నందికొట్కూరు పట్టణం ఈనెల 18 న గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జమ్మి చెట్టు నుండి బైక్ ర్యాలీ మహాత్మ జ్యోతిరావు పూలే పటేల్ సెంటర్ వరకు జరుగుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం మరియు గ్రామాల బీసీ యువకులు బిసి మహిళలు బీసీ ఉద్యోగులు బిసి ప్రజలందరూ మన హక్కులను సాధించుకునెందుకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అర్బన్ అధ్యక్షులు విజయ్ కుమార్ , నియోజకవర్గం అధ్యక్షులు నాగులుటి గోకారి, టీచర్ ఖజా హుస్సేన్ సాహెబ్ , పగిడ్యాల మండల అధ్యక్షులు బలరాముడు, ఆర్ఎంపి శ్రీనివాసులు, శ్రీనివాసులు, ధను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.