డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డా.బీఆర్ అంబేడ్కర్ 132 వ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శివ ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం నందికొట్కూరు తాలూకా మాల మహానాడు కార్యాలయంలో అధ్యక్షులు పబ్బతి శివప్రసాద్ ఆధ్వర్యంలోముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ, నవభారత నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి,డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించారు.రిజర్వ్ బ్యాంక్ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. భారతదేశ పరిపాలన దశాదిశా నిర్ణయించిన మేధావి అని కొనియాడారు. పంచాయతీ స్థాయి నుండి పార్లమెంటరీ స్థాయి వరకు పరిపాలన ఏవిధంగా జరిగాలి, అన్ని రకాల చట్టాలను రాజ్యాంగం లో పొందుపరిచాడు. భారత రాజ్యాంగం భారత పరిపాలన వ్యవస్థకు చుక్కాని లాంటిది. అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ వెంకటేష్, విల్సన్,రాజు, రవి, ప్రవీణ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.