జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం అట్టహాసంగా జరపండి
1 min readపల్లవెలుగు వెబ్ కర్నూలు: పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లలో నియోజకవర్గస్థాయి మరియు జిల్లాస్థాయిలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నట్లు. డీఈవో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో . మే 25న జిల్లాస్థాయిలో మే 27న. జరుపుతారు. నియోజకవర్గస్థాయిలో ఆ నియోజకవర్గపు. శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా ఉంటారు.ఫెసిలిటేషన్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించాలి. సంబంధిత నియోజకవర్గంలో హాజరు కావాలి. అత్యధిక మార్కులు పొందిన విద్యార్థితో పాటు విద్యార్థి తల్లిదండ్రులను. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని సన్మానించాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి ముందుగానే విషయం తెలిపి ఆయన యొక్క అనుమతిని తీసుకోవాలి. స్థానికంగా ఉండే ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలి. సమీపంలో ఉండే విద్యార్థులను కూడా ఆహ్వానించాలి.నియోజకవర్గ స్థాయిలో 10వతరగతి విద్యార్థులకు 3 ప్రైజెస్ ఉంటాయి మొదటి ప్రైజ్… 15,000,రెండవ ప్రైజ్ 10,000 మూడవ ప్రైజ్ 5000.ఇంటర్ వారికి 15,000 చొప్పున నలుగురికి ఇస్తారు. ఇందులో mpc,bipc,hec, cec.వారు వుంటారు. జిల్లా స్థాయిలోపడవ తరగతి వారికి 50,000 మొదటి 30000 రెండవ 15000 మూడవ ప్రైజ్ ఇస్తారు. ఇంటర్ వారికి 50000 చొప్పున నాలుగు గ్రూపులతో నలుగురికి ఇస్తారు. జిల్లాస్థాయిలో. మొదటి స్థానంలో ఉన్నవారు దండి అభయ్ చరణ్ జడ్.పి.హెచ్.ఎస్. సంత గూడూర్ ఆదోని మార్కులు 588. రెండవ స్థానంలో ఉన్నవారు ఈడిగ గణేష్. ఎం జె పి ఏపీ బీసీ వెల్ఫేర్. గోనెగండ్ల 586 రెండవ స్థానంలోనే మరో విద్యార్థి. సుస్మిత ఏపీ అబ్దుల్ కలాం. మున్సిపల్ స్కూల్ 586 మూడవ స్థానంలో. గుడిసె మనోహర్. ఎం జె పి ఏ పి. గోనెగండ్ల 584 సాధించారు.