PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా రంజాన్ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని పెద్ద మసీదు దగ్గర ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు శుక్రవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్‌లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పట్టణాలలో పల్లెల్లో ప్రతి గ్రామంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలోఅవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కు బయలుదేరడానికి ముందు ప్రతి ముస్లిం జకాత్ మరియు ఫిత్రాలను విధిగా చెల్లించి నమాజ్కుబయలుదేరుతారు. ఇమామ్ రంజాన్ పండుగ ప్రత్యేకత రంజాన్ గొప్పతనం భయాన్ చేశారు. బయన్ అనంతరం పండుగ నమాజ్ ముగించుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగశుభాకాంక్షలు తెలుపుకున్నారు.మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

About Author