మహాత్మ జ్యోతిబా పూలే 198 వ జయంతిని జయప్రదం చేయండి
1 min read
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు, న్యూస్ నేడు: (కర్నూలు) కర్నూలు పట్టణంలోని బిర్లా గేట్ సమీపంలో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర రేపు 11- 4- 25,, శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు జరగబోవు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని జయప్రదం చేయాలని కర్నూలు పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పనిచేసే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీలు హాజరై జయప్రదం చేయాలని… మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగ నిర్వహిస్తున్నందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు.. అలాగే మొన్న ఎన్నికల సమయంలో మన తెలుగుదేశం పార్టీ బీసీలకు మేనిఫెస్టోలో తెలిపిన విధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు, అలాగే స్థానిక సంస్థలు రిజర్వేషన్ల పెంపు, అలాగే బీసీ కులాల జనగణన, ఎస్సీ ఎస్టీలవలే బీసీల రక్షణ చట్టం, రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో కనీస వసతులు కల్పిస్తూ సన్న బియ్యం సరఫరా చేసి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి ఆయన కోరారు…ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పి విజయ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపేట రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి జి వెంకటేష్,. ఎం మహేష్ యాదవ్, ప్రతాప్, శ్రీనివాసులు, భాస్కర్, పొట్టిపాటి శ్రీరాములు,వివిధ కుల సంఘాల నాయకులు హాజరయ్యారు.