ఘనంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎమ్ ఎమ్ గుప్త జన్మదిన వేడుకలు..
1 min read– వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేసిన మోహన్ గుప్త..
– హాజరైన వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గుప్తా ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వ్యాపార వేత్త మడుపల్లి మోహన్ గుప్త 75వ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఉదయం స్థానిక కోటదిబ్బ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గుప్తా ఫౌండేషన్ సంస్థ ఆడిటర్ డివి.సుబ్బారావు మాట్లాడుతూ1969 నుండి మడుపల్లి మోహన గుప్త ఏలూరు కేంద్రంగా ఎగుమతుల వ్యాపారంలో ఉన్నారని, 1989లో గుప్తా ఫౌండేషన్ ను ప్రారంభించారన్నారు. 1994లో మోహన్ గుప్త తమ తండ్రి పేర శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రదానాన్ని ప్రారంభించారన్నారు. ఇప్పటికీ మూడు దశాబ్దాలకు పైగా గుప్తా ఫౌండేషన్ అసంఖ్యాక సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రజ్ఞామూర్తులు, ఇరవై ఒకరిని సత్కరించింది. సాహిత్య రంగంలో ఇప్పటికీ 19 మంది శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. గుప్త జన్మదిన సందర్భంగా సాంఘిక సేవా సంస్థలకు వైద్యాలయములకు అందచేస్తున్న బూరి విరాళాలకు తోడు, తెలుగు భాషా వికాసానికి, తెలుగు చదువర్ణ చైతన్యానికి కృషి చేస్తున్న సాహితీమూర్తులకు పురస్కారం అందచేయబడుతుంది. ఇరవై ఐదు లక్షల రూపాయలను అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చెన్నై వారికి పేదల క్యాన్సర్ చికిత్స కొరకు వినియోగించు నిమిత్తం అందచేయడం జరుగును. ఇరవై లక్షల రూపాయలను శంకర నేత్రాలయ, చెన్నై వారికి పేదల కంటి చికిత్స కొరకు వినియోగించు నిమిత్తం అందచేయడం జరుగును, రూ. 10 లక్షల రూపాయలు విలువ గల పోలియో వ్యాధి గ్రస్థులకు కావలసిన క్యాలిపర్స్, అంగవైకల్యo గల వారికి ఆర్టిఫిషియల్ లింబ్స్ ను, విర్డ్ హాస్పటల్, ద్వారకాతిరుమల వారిచే నిర్ధారించబడిన వారికి అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 20 మంది పోలియో వ్యాధిగ్రస్థులకు 2.50 లక్షల విలువ గల క్యాలిపర్స్ను , గుప్త గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది. రూ. 1 లక్ష 25 వేల విలువ గల ఆర్ఓ వాటర్ ప్లాంటు పరివర్తన్ స్కూల్ (మూగ, చెవిటి) వారికి అందచేయడం జరిగింది. దొండపాడు,-2023 లో శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారానికి గాను ఆచార్య కొలకలూరి ఇనాక్ కి ప్రకటించడం జరిగింది. వీరికి ప్రశంసా పత్రము, జ్ఞాపిక, నగదు పురస్కారం క్రింద మూడు లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుంది. ఈఏడాది ఆరంభంలో గుస్సా ఫౌండేషన్ సంస్థ సుమారు 22 లక్షల రూపాయల విలువ గల ముక్తి రథం – మోక్ష రథం అనే రెండు వాహనాలను మరణించిన వారిని స్మశాన వాటికకు తరలించుటకు వీలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఉచితముగా అందచేయడం జరిగింది. అనంతరం కాళ్లు, చేతులు లేనివారికి నడవలేని పరిస్థితిలో ఉన్నవారికి కృత్రిమ అవయవాలను వారికి ఇచ్చి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈకార్యక్రమంలో జ్యూట్ మిల్స్ అధినేత లునాని, టేకో బ్యాంక్ చైర్మన్ అంబిక ప్రసాద్, నాట్యచార్య కె.వి, గుప్తా ఫౌండేషన్ సంస్థ ఆడిటర్ డివి.సుబ్బారావు , మేనేజర్ శ్రీనివాస్, పలువురు పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు గుప్తకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.