సిపిఐ ప్రచార జాత బస్సు యాత్రను జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : సోమవారం ఆస్పరి మండలంలో జరిగినటువంటి ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలో రామతీర్థం క్షేత్రం నందు సిపిఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య ముఖ్య అతిధులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం అనంతరం సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య ఆధ్వర్యంలో మరియు కల్లప్ప ఆచారి అధ్యక్షతన ఆధ్వర్యంలో హొళగుంద మండల సిపిఐ కార్యదర్శిగా బీమారెప్పను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈనెల ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 8 వరకు సిపిఐ ప్రచార జాత బస్సు యాత్రను జయప్రదం చేయండి సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య. ఆస్పరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలూరు నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం రామ తీర్థ క్షేత్రం నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి. గిడ్డయ్య గారు జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఏ ఒక్కటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయక పొగ రైతులు, కార్మికులు ,మహిళలు, విద్యార్థి యువజన హక్కులను భరించే రీతిలో దుష్ట చట్టాలు మూడు వినాశక వ్యవసాయ చట్టాలను 44 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి 29 కార్మిక చట్టాలను మింగేశారు సంస్కారానికి నిరుద్యోగ యువతీ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తానని నేటికీ ఇంతవరకు అమలు చేయలేదని అత్యధిక వెనకబడిన ఆలూరు నియోజకవర్గం సస్య శ్యామలం చేయాలంటే తక్షణమే వేదవతి ప్రాజెక్టును ఎనిమిది టిఎంసి సమర్థ్యంతో నిర్మించి నియోజకవర్గంలోని గ్రామాలకు తాగే నీరు సాగే నీరు అందించాలని అదేవిధంగా వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి ఆస్పరిమండలాన్ని చేర్చి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సాగినీరు అందించాలని అందరి నివా కాలువలు ద్వారా ఆస్పరి మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సాగునీరు ఇవ్వాలని ఈనెల, 9,10 తేదీలలో నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని 17, 18, 19 తేదీలలో అఖిలపక్షల రౌండ్ టేబుల్ సమావేశాలు సెప్టెంబర్ 2 న ఆలూరు లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం హొళగుంద మండల సమితి సమావేశంలో మారెప్పను హొళగుంద మండల కార్యదర్శిగా ఏకీభవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూపేష్ కృష్ణమూర్తి, ఆలూరు మండల కార్యదర్శి రామాంజనేయులు, ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్షులు శివ,హొళగుంద మండల కార్యదర్శి కాలప్ప చారి, రాజశేఖర్, మారెప్ప, రంగన్న, సిపిఐ నాయకులు ఆంజనేయ బ్రహ్మయ్య, ఉరుకుందప్ప దస్తగిరి శివన్న హనుమంతు శ్రీనివాసులు గోపాలు రంగన్న కృష్ణ బడే సాబ్ నరసప్ప కైరుప్పుల దొడగొండ ఉప సర్పంచులు వెంకటేశు వీరేష్ రామాంజని రైతు సంఘం నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ రంగప్ప హరి తదితరులు పాల్గొన్నారు.