రంజాన్ పండుగ ను ప్రశాంతంగా జరుపుకోండి
1 min readపల్లె వెలుగు వెబ్ గోనెగండ్ల: మండలకేంద్రమైన గోనెగండ్ల పోలీసు స్టేషన్ లో రంజాన్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ ను ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఎస్ఐ తిమ్మారెడ్డి లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామ పెద్దలతో మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు, గొడవలు జరగ కుండ తగిన చర్యలు చేపట్టాలని, అలాగే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపు లో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు ఎవరు పెట్టరాదని వాటిలో నిజానిజాలు తెలుసుకోకుండా పెడితే గ్రూప్ అడ్మిన్లు బాధ్యులు అవుతారని అన్నారు. కావున అందరూ సంయమనంతో శాంతి యుతంగా అందరూ కలసి అన్నదమ్ముల మాదిరిగా రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్ ఐ లు వెంకటేశ్వర్లు, తిమ్మారెడ్డి, కానిస్టేబుళ్లు మురారి, నాయక్ పోలీసు సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.