PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిబంధనలను అనుసరించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి 

1 min read

పత్తికొండ డిఎస్పి శ్రీనివాస రెడ్డి సూచన               

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ సబ్ డివిజనల్ పరిధిలోని ప్రజలు అందరికీ  ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేస్తూ, పోలీసు వారి నిబంధనలను అనుసరించి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని డి.ఎస్.పి శ్రీనివాస రెడ్డి సూచించారు. డిసెంబర్ 31వ తేది రాత్రి పది గంటలు తరువాత ప్రజల గుంపులు గుంపులు తిరుగడం కాని ఒకే ప్రదేశంలో ఉండడం కాని చేయకూడదని అన్నారు.రాత్రి వాహనాల తనిఖీలు ఉంటుందని, మద్యం సేవించడం గాని ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం గాని, నేషనల్ హైవే పై బైకు రేస్ చేయడం ఇలాంటి చర్యలకు పాల్పడితే  వారిపై కేసులు నమోదు చేయడము జరుగుతుందని తెలిపారు.నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలు వీధులలో లేదా రోడ్లపై చేయకూడదని, కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ తమ ఇళ్లలోనే వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవాలి సూచించారు.రాత్రి 10 గంటల పైన హోటల్స్, రెస్టారెంట్ లు మరియు టీ అంగళ్లు ముసివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో నడుపుటకు అనుమతి లేనందున, ఏదేని కార్యక్రమాలు చేయుటకు ముందస్తు పర్మిషన్ DSP గారి నుండి పొందవలెనని తెలిపారు. లేనిచో చట్ట రీత్యా చర్య తీసుకోబడునని అన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి యువత తాగిన మైకంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా వేడుకను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. అలాగే ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ లు తీసి అధిక శబ్దాలతో రోడ్లపై నడిపే వారిపై కఠినంగా వ్యవహరించబడునని ఆయన హెచ్చరించారు. ఈ నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత రోడ్లపైకి వొచ్చి వొచ్చేపోయే వాహనాలకి ఇబ్బందులు కలిగించటం గాని, వాహనాల అద్దాలును ధ్వంసం చేయడం గాని చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు.

About Author