PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ 116వ జయంతి వేడుకలు

1 min read

– నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, కర్నూలు నగర మేయర్, కర్నూలు,ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ, బిసి, దళిత ప్రజాసంఘాల నాయకులు.
– డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం – జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు.బుధవారం కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు -5 రోడ్డు జంక్షన్ నందు గల డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఆర్డీవో హరి ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఎస్ ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, దళిత, బీసీ, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వేదిక వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, దళిత సంఘాల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, నగర మేయర్ లు కేక్ కట్ చేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతోత్సవం వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎప్పటికంటే ఉన్నతంగా ఇలాంటి ఉత్సవాలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయ సాధనకు సమసమాజ స్థాపనకు మనమందరం కూడా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది వక్తలు మాట్లాడుతూ స్మశానానికి స్థలాలు కేటాయించలేదని దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో దీనికి కూడా పరిష్కారం చేస్తామని కలెక్టర్ అన్నారు. మా పరిధిలో ఉన్న ప్రజా సమస్యలన్నీ మేమే పరిష్కరిస్తాం మా స్థాయిలో లేని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం అని కలెక్టర్ అన్నారు.ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ను ప్రవేశపెట్టిందని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తున్నాయని అన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూడాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడుని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాలని అన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల పక్షాన నిలబడిందన్నారు. ఏదైతే మహనీయులు కలగన్నారో ఆ కలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో బడుగు బలహీన వర్గాలఅందరూ ,సామాజికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెనుకబడి ఉన్నామని అధైర్యపడకుండా, బాధ పడకుండా ముందడుగు వేయాలన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమం కొరకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని ప్రభుత్వం ముఖ్యంగా విద్య మరియు వైద్యం, మహిళ సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని నాడు నేడు కింద పాఠశాలలను అందంగా తీర్చిదిద్ది పేదలందరికీ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన పాఠశాలలో విద్యను అందించడం జరుగుతుంది వైద్యపరంగా ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో కూడ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలను అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ డాక్టరు బాబు జగ్జీవన్ రామ్ అందరూ సమానంగా ఉండాలని ఎంతగానో కృషి చేశారని అందుకు అనుగుణంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేయడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల కు అందించాలనే లక్ష్యంతో దాదాపు 2లక్షల 30వేల కోట్ల రూపాయలను దళారీ వ్యవస్థ లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడమే అందుకు తార్కాణం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తూ అందరినీ సమానంగా చూడడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా రాజ్యాంగ పదవులు కల్పించడంలో భాగంగా ప్రస్తుత మంత్రివర్గంలో 15 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి పదవులు కేటాయించడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య పరిపాలన సచివాలయం వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలు కార్యాలయాల చుట్టు తిరగకుండా అన్ని వారికి ఇంటి వద్దకే సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి 70 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పిల్లలను భవిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు గాను పౌష్టికాహారాన్ని అందించడం జరిగిందన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. అదే విధంగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానంలో భాగంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఎంతో కృషి చేస్తూ ఉందన్నారు. ఈలాంటి ఎందరో మహానుభావులు వేసిన బాటలో మనమందరం నడిచి దేశ ప్రగతికి బాటలు వేయాలన్నారు.డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కర్నూలు ఆర్ డిఓ హరి ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డిడి ప్రతాప్ సూర్య నారాయణ రెడ్డి, మాజీ మేయర్ బంగి అనంతయ్య,Ch.మద్దయ్య,Ch. బజారన్న,అనంతరత్నం,రెడ్డీపోగు రాజకుమార్,R. కైలాష్ నాయక్,R. చంద్రప్ప, వేల్పుల జ్యోతి,A. నాగేశ్వరి,రేణుకమ్మ,శ్రీ రాములు,N. సోమసుందరం,C. M. రమేష్ ,సుభాష్ చంద్ర,చిటికల సామెల్, కాసారపు వెంకటేశ్వర్లు.గద్దల సుబ్బయ్య, తూర్పటి మనోహర్,రెడ్డిపోగు విజయ్,R. రామకృష్ణ ,దారుర్ నరేష్ ,ప్రవీణ్ కుమార్,సుభాకర్ ,మల్లెపోగు రాజన్న, నక్కల మిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొని.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారిని గురించి కొనియాడారు.

About Author