NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు

1 min read

అంబేద్కరుడు – అందరివాడు                                                                      

పల్లెవెలుగు వెబ్​ ఎమ్మిగనూరు : డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్  133వ జయంతి ఉత్సవాలు మంత్రాలయం మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ గ్రామాల్లో మరియు మంత్రాలయం , ఎమ్మిగనూరు పట్టణంలో చాలా ఘనంగా జరిగాయి. వందల మందితో ర్యాలీగా వెళ్లి అంబేద్కరుకు ఘణ నివాళులు అర్పించారు. సుంకేశ్వరి, పొనకలదిన్నె, బూదూరు, వి.తిమ్మాపురం, మాలపల్లి, పరమానుదొడ్డి, చిలకలడోణ గ్రామాల్లో  అంబేడ్కర్ వ్యాస రచన  పోటీల్లో బహుమతి సాదించిన వారికి బహుమతులు అందజేశారు. ముఖ్యంగా మంత్రాలయం పట్టణ  సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలీషా వలి మంత్రాలయం అంబేడ్కర్ ఉత్సవంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. రెండు నియోజకవర్గాల్లో బాహుజనులందరినీ కలుపుతూ అంబేడ్కర్ ఉత్సవం జరుపుకోవడం మరియు వందల మందిని భాగస్వామ్యం చెయ్యడం  ప్రజల్లో మంచి చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్ర ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా అధ్యక్షులు మరియు బహుజన సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు రామతీర్థం అమరేష్ మరియు టీం  సభ్యుల, బి.ఎస్.పి నాయకులు  మంచాల లక్ష్మి నారాయణ మరియు టీమ్  సభ్యుల సహకారంతో చాలా ఘనంగా జరిగాయి. వారంతా అంబేద్కర్ అందరి వాడని , ఆయనను ఒక కులానికి కట్టేసి మాట్లాడటం తగదని, రాజ్యాంగ ఫలాలు అందరికీ పంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ముఖ్య అతిధిగా  హై కోర్టు న్యాయవాది కాకర్ల చంద్ర శేఖర్ పాల్గొని అన్ని సభల్లో ప్రసంగిస్తూ ప్రతి ఇంట్లో అంబేడ్కర్ పటం వుండాలని అయన పాటలు పాడుతూ , అంబేడ్కర్   బహుజన మైనారిటీల హక్కులను వంద సంవత్సరాల ముందే కనుగొన్న కాలజ్ఞాని అని, ఆయన రాజ్యాంగ సేవలను కొనియాడారు.

About Author