NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అటల్ బిహారీ వాజ్ పెయి జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలను బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లో బిజెపి ఆధ్వర్యంలో భారత మాజీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు.భారత జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని కేంద్ర కమిటీ యిచ్చిన  సందర్భంగా వెల్దుర్తి మండలం వెల్దుర్తి పట్టణం నందు బస్టాండ్ సమీపంలో బిజెపి కార్యకర్తలు బిజెపి జండా ఎగరవేయుటకు జెండా పాతారు. అయితే అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుండగులు  జెండాని తొలగించారు. జెండాను తొలగించిన దుండగులను అరెస్టు చేయాలని వెల్దుర్తి ఎస్సైకి  పత్తికొండ తాలూకా బిజెపి  అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ణీ,కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు కలిసి వినతి పత్రం అందజేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

About Author