ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు
1 min read– ఫోటోగ్రాఫర్ లావణ్య కి ప్రతిభా పురస్కారం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ది ఏలూరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ లో సభ్యురాలిగా పనిచేస్తున్న బి లావణ్య కి కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రశంస పత్రం, మెమౌంటో అందించారు, ఈమె అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా తన ప్రయాణం మణి డిజిటల్ ఫోటో స్టూడియోలో ప్రారంభించి. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ లో మంచి ప్రావీణ్యత సాధించి రాజకీయ, సామాజిక , ప్రభుత్వ శాఖలలో మంచి ఫోటోగ్రాఫర్ గా రాణిస్తూ అందరి మన్నలను అందుకుంటుంది, తాను చేస్తున్న పనిలో నిబద్ధతతో బాధ్యతగా కష్టించి పనిచేయడం అలవర్చుకున్నానని. అదే నేడు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా మెమొంటోతో ప్రశంసలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత పది సంవత్సరాలు గా తనకిష్టమైన ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకుని పలువురి చేత శభాష్ అనిపించుకుంటుంది. మహిళ విద్యతోనే రాణించాలన్న ఆకాంక్షతో తాను( లా ) విద్యాభ్యాసం చేస్తున్నానని తెలిపింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 2022 – 2023వ సంవత్సరనికి గాను మార్చి 8వ తేదీ బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసిడిఎస్) మరియు ఏపీ ఎన్జీవోస్ సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం లో లావణ్య కి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా మెమొంటో అందజేసి శాలువాతో చిరు సత్కారo చేశారు, ఈమె ధైర్యసహసాహతాలతో ఒడిదుడుకులను అధిగమిస్తూ కుటుంబ సభ్యుల సహకారంతో సమాజానికి సేవలు అందించి అధికారులు, అనధికారులు రాజకీయ ప్రముఖులు మరియు సహ ఫోటోగ్రాఫర్లచే (యంగ్ వర్కింగ్ గర్ల్ )అని పలువురి మన్ననలు అందుకున్నారు. లావణ్య కి విచ్చేసిన ఉద్యోగులు, అధికారులు. ఆహుతలు హర్షధ్వనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఫోటో అండ్ ప్రింట్ మీడియ. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు.