PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మాధ్వ నవమి వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో ద్వైత సిద్ధాంతం గురువు మాధ్వచార్యులు ఆరాధన మాధ్వ నవమి   ని పురస్కరించుకొని మాధ్వ చార్యులు వారి విగ్రహం కు విశేష అభిషేకం అర్చనలు నిర్వహించడం జరిగింది. ఉదయము శ్రీవారి బ్రహ్మోత్సవాలు లో 9 వ రోజు అభిషేకం విశేష అర్చన, మహా మృత్యుంజయ హోమం ధన్వాన్తరీ హోమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం , శారద సంగీత కళాశాల మాస్టర్ శ్రీ కిరణ్ గారిచే సంగీత కచేరి,హంస వాహనం పై పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమం కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు, గౌరవ సలహాదారులు హెచ్ కె మనోహర్ రావు, సభ్యులు kg ప్రభాకర్, ఉమేష్ , కెవి సుబ్బారావు , రామ మనోహర్, కె.వి విజయభాస్కర్, బాల సత్యనారాయణ, దుర్గాప్రసాద్, శ్రీనాథ్, వాయిస్ సేన సేవాదళ్ మహిళా సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author