PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సావిత్రి బాయ్ పూలె 193వ జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  పాణ్యం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ లో సావిత్రిబాయి పూలే. జ్యోతిబా రావు పూలే విగ్రహాలకు SFI  విద్యార్థి, యూవజన సంఘాలు ఘనంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం  జిల్లా నాయకుడు ప్రతాప్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ భారతి  మాట్లాడుతూ, నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందన్నారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.  ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి… అని అంతకముందే స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులు అందరు సావిత్రి బాయ్ , జ్యోతి రావు పూలె,విగ్రహాలు కు పూలమాలలు వేసి నివాళి  అర్పించి, స్కూల్ లో  ప్రతి ఆడపిల్ల విద్యార్థి  ,  సమాజం లో దర్యం గా ముందుకు వెళ్లి అన్నిరంగాల్లో మహిళా ఉపాధ్యాయులు గా ఎదగాలన్నారు, మోడల్ స్కూల్ లో ప్రతి విద్యార్థి, క్రమశిక్షణతో మెలగాలని కోరారు ఈ కార్యక్రమం లో sfi నాయకులు రాజా, సతీష్, నాగరాజు  జగదీష్,. … ఉపాధ్యాయులు  వీరేష్,  చంద్రకళ, కవిత, కళావతి, ప్రవీణ రుక్సానా, భవాని తదితరులు పాల్గొన్నారు.

About Author