ఘనంగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
1 min read
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: సాంప్రదాయ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు భిన్నంగా సామాన్య యువతీయువకులను నాయకులుగా తీర్చిదిద్ది, తద్వారా ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తును ఉజ్వలంగా చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించారు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కుల, మత, వర్గ బేధాలు లేకుండా సమస్య వస్తే గుర్తొచ్చేది జనసేన పార్టీ. ఆపదలో అండ జనసేన జెండా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవని పురస్కరించుకుని రాయచోటి పార్టీ కార్యాలయంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా రాయచోటి వీర మహిళ రెడ్డి రాణి, పల్లవి, బుడ్డా శరత్ బాబు,సలీమ్, మద్దిమాను రామాంజులు, రియాజ్, పెద్ద ఎత్తున జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.