ఘనంగా స్వామీ వివేకానంద స్కూల్ 35వ వార్షికోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం పట్టణంలోని స్వామీ వివేకానంద స్కూల్ 35వ వార్షికోత్సవవేడుకలు తమ స్కూల్ కాంపౌండ్ లో ఘనంగా జరిగాయి.ముందుగా కమలాపురం ఎస్ ఐ చిన్న పెద్దయ్య , ఫైర్ ఎస్ ఐ నాగేశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, రాజేశ్వరి, హెడ్ మాస్టర్ లు వేదికను అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎస్ ఐ. చిన్నపెద్దయ్య మాట్లాడుతూ పిలల్లను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలని,మొక్కై వంగనిది మానై వంగదని తెలిపారు.ముఖ్యంగా పిల్లలకు అవసరం లేకుండా మొబైల్ పోన్ దూరంగా ఉంచాలని, ఈ మధ్యకాలంలో తన దగ్గరకు వచ్చిన ఒక మొబైల్ అడిక్ట్ కేసు ఉదంతంగురించి ఆయన ఈ సందర్భముగా పిల్లలకు వారి తల్లితండ్రులకు వివరించారు.కావున పిల్లలకు అనవసరంగా ఇవ్వరాదని సూచించారు.తదుపరి ఈ సందర్భముగా యేర్పాటు చేసిన వేదికపై పిల్లలు పలురకాల వేషధారణలతో,వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులలో స్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపొగా ,కరతాలద్వనులమధ్య పిల్లలు అద్భుతప్రదర్శన ఇచ్చారు.ముఖ్యవిశిష్ట అతిథిగా విచ్చేసిన తెదేపా రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీబట్ల సాయినాథ్ శర్మ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు ,. ముఖ్యముగా పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షలు బాగా వ్రాసి పై చదువులకు వెళ్లి తాము చదివిన విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు,ఆహ్వానం మేరకు వచ్చిన ఆహూతులకు భోజన సదుపాయం కల్పించారు. కరెస్పాండెంట్ రామసుబ్బారెడ్డి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు.