NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 553వ జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో.ఆంధ్రభోజుడుశ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి వేడుకలను బనగానపల్లె శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయస్వామి దేవస్థానంలో జరిగిన జయంతి వేడుకలలో శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవ రాయలు ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడని అన్నారు. కృష్ణరాయలను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారని అన్నారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డాడని కొనియాడారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని బనగానపల్లె పట్టణంలోని పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఏర్పాటు చేసుకునేందుకు బలిజ సంఘీయులందరూ నిర్ణయించారు. సంఘీయులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించాలని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం గౌరవాధ్యక్షులు సుర రామసుబ్బయ్య, అధ్యక్షులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కొట్టె రవి ప్రకాష్, బండికారి వెంకటయ్య, జనరల్ సెక్రెటరీ నీలి శ్రీనివాసులు, జాయింట్ సెక్రెటరీలు కరకుల రామసుబ్బారెడ్డి, ఆకుల శాంతనుడు, ట్రెజరర్ నీలి వెంకట రమేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూకుట్ల మద్దిలేటి, ఉప్పు రాజశేఖర్, సాధనగిరి నాగార్జున, కోటపాటి సూర్యనారాయణ రెడ్డి, దూలం శంకర్ రెడ్డి, ఆకుల దస్తగిరి, ఓజ వెంకటసుబ్బయ్య, శిరిపి మనోహర్, తొక్కల నరహరి, గునిశెట్టి వెంకటకృష్ణ, నీలి రామకృష్ణ, మాదాసుపల్లె యాగంటి రెడ్డి, సాదు కొట్టం శ్రీను, ఎం రాముడు, కే మధు సుధాకర్, బలిజ సంఘీయులు తదితరులు.పాల్గొన్నారు.

About Author