PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

1 min read

– అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు
– జిల్లా ఖజానా శాఖ అధికారి టి కృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా ఖజానా కార్యాలయం ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఖజానా శాఖ అధికారి టి. కృష్ణ హాజరై మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు మహిళలందరూ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారని ఆ స్థానం నిలబెట్టుకోవాలి అంటే ఇంకా కష్టపడి పని చేయాలని, ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక ను తెలుసుకోవాలన్నరు , జిల్లా ఖజానా కార్యాలయంలో సహాయ ఖజానాధికారి మరియు అడ్మిన్ ఉప ఖజానాధికారి మహిళలే ఉండడం మనకు గర్వకారణం అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సహాయక ఖజానాధికారిని పి. ప్రేమావతి పాల్గొని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, నేడు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం వారు దిశా యాప్ ప్రవేశ పెట్టారని మహిళలందరూ దిశ యాప్ వినియోగించుకోవాలని, నూతన సాంకేతికతను నేర్చుకోవాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కప్పలప్పల సత్యనారాయణ , ట్రెజరర్ నెరుసు గణేశ్వరరావు సీనియర్ ఉపఖజానాధికారులు జిల్లా ఖజానా కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నరు.

About Author