NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుదవారం పత్తికొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విభిన్న రంగాలలో మహిళలు సాధించిన ప్రగతి లో భాగంగా కొంతమంది మహిళలను సన్మానించడం జరిగింది. ఇందులో పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ కొమ్ముదీపిక గారు, నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్  శ్రీ వెంకటలక్ష్మి గారు, హాస్టల్ వార్డెన్ శ్రీ పావని గారు, ఆశా వర్కర్ శ్రీ ఉమాదేవి గారు, టైలర్ మరియు ఫ్యాషన్ డిజైనర్ శ్రీ లలిత గారు, స్వయం ఉపాధి రంగంలో రాణిస్తున్న శ్రీ పావని గారు ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి శ్రీ ఆస్పరి శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు  శ్రీ నాగేంద్ర గారు, బీసీ సంక్షేమ సంఘం తాలూకా కార్యదర్శి శ్రీ గోవింద్ గారు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీఅగ్రహారం మునిస్వామి గారు, టీచర్ సుధాకర్ గారు, జూనియర్ లెక్చరర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు, అంజి, రమణ, రమేష్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది.

About Author