వేడుక ఏదైన ఒకే కూర.. ఒకే స్వీటు !
1 min readపల్లెవెలుగువెబ్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి వేడుకల్లో ముస్లింలు వంటకాల పై ఎక్కువగా ఖర్చు పెట్టకుండా పరిమితి విధించారు. పేద ముస్లింలకు ఖర్చును తగ్గించారు. ముస్లిం ఆడ పిల్లల పెళ్లిల్లలో వంటకాల ఖర్చు అధికంగా ఉంటోంది. దీంతో ఎంతో మంది ఆర్థిక స్థోమత లేని ముస్లింలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా కరోన తర్వాత చాలా మంది ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో పెళ్లి ఖర్చులకు చెక్ పెట్టాలని మతపెద్దలు భావించారు. దీంతో పెళ్లిల్లలో ఒకే కూర, ఒకే స్వీటుతో పెళ్లి తంతు ముగించేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా అభినందలు తెలియజేస్తున్నారు. చికెన్ లేదా మటన్.. వీటితో పాటు బగారా అన్నం, ఒక స్వీటుతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.