బీరం ఇంట వెల్లి విరిసిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: ఖాజీపేట మండలం కడప – కర్నూల్ హైవే సమీపంలోని బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల్లో జనవరి 26వ తేదిని పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా కరస్పాండెంట్ సుబ్బారెడ్డి ,చైర్పర్సన్ సరస్వతి , గ్రూప్-1 ఆఫీసర్ బీరం శ్రీకాంత్ రెడ్డి , డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ విచ్చేశారు. చైర్ పర్సన్ సరస్వతమ్మ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు.ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి ముఖ్య అతిథి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ స్వాతంత్ర్యం, గణతంత్రం అనేవి ఎందరో వీరుల త్యాగఫలం అని, వారి వీర గాధలను, స్వాతంత్రానికి, గణతంత్రానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను విద్యార్థులకు వివరించారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించి అక్షరాస్యతలో ఉన్నత స్థానాన్ని సాధించి ప్రపంచ దేశాలకే భారతదేశం తలమానికంగా నిలవాలని, ఆ ఖ్యాతిని ఘటించడానికి ప్రతి భారతదేశ పౌరుడు తన వంతు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలలో బీరం విద్యాసంస్థల కరస్పాండెంట్ బీరం సుబ్బారెడ్డి ,చైర్ పర్సన్ సరస్వతమ్మ లు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు రాజ్యాంగం యొక్క నిబంధనలను అనుసరించి ఉండాలని, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు.మరియు కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల డైరెక్టర్ బీరం స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ దేశం అభివృద్ధి సాధించాలంటే యువతరం భాగస్వామ్యం కావాలని నేటి బాలలే రేపటి పౌరులు అని అన్ని రంగాలలో దేశం గర్వించదగ్గ స్థానంలో యువత ముందుండాలని, గణతంత్ర దినోత్సవ ముఖ్య ఉద్దేశాన్ని, భారత రాజ్యాంగ విశిష్టతను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీరం పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా , కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వ్యాయామశిక్షణ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో, కళాశాలలో నిర్వహించిన పలు అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు మరియు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.