మరియా నిలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: కర్నూలు మండల పరిధిలోని గార్గేయపురం మరియా నిలయం పాఠశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రేమగిరి విచారణ గురువులు రాజశేఖర్ హాజరయ్యారు.అనంతరం విచారణ గురువు రాజశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా విచారణ గురువు రాజశేఖర్ మాట్లాడుతూ ఆగస్టు 15-1947 బ్రిటిష్ పాలకుల నుంచి భరత మాతకు విముక్తి కలిగిన రోజు అని ఎంతోమంది త్యాగాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినదని ఈ రోజున యావత్ భారతదేశం 77వ స్వాతంత్రం దినోత్సవాలను ఎక్కడ చూసినా ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను మనం ఎగుర వేస్తున్నామంటే బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలను లెక్కచేయకుండా వారి ప్రాణాలను అర్పించినందునే మనం జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని ఆయన అన్నారు.విద్యార్థులు ఇప్పటి నుంచే మంచిగా చదువుకుంటూ మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.తదనంతరం విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి పాటలకు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.ఈ కార్యక్రమంలో మరియా నిలయం సుపీరియర్ సిస్టర్ స్వాతి,పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ట్రీసా,సోషల్ డైరెక్టర్ సిస్టర్ సారంగా,సిస్టర్ క్లేరీన మరియు ఉపాధ్యాయులు డేవిడ్,మోషన్న,హుస్సేన్,రాణి, జ్యోతి,డీన,పద్మ,రామేశ్వరి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.