ఎంపీ శబరి వర్గంలో సంబరాలు..
1 min read
కోరం లేకపోవడంతో వాయిదా:ఆర్డీఓ
హాజరైన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
పట్టణంలో భారీ పోలీస్ బందోబస్త్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం గురువారంతో తెరపడింది. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వర్గం కౌన్సిలర్లు ఆత్మకూరు ఆర్డీవోను కోరగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో 8వ తేదీన అవిశ్వాస తీర్మానానికి రావాలని కౌన్సిలర్లకు నోటీసులు ఆర్డిఓ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీవోను కలెక్టర్ నియమించారు.నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ హాజరయ్యారు. నిన్న ఉదయం 11 గంటలకు అధికారులందరూ కౌన్సిల్ కు చేరుకున్నారు.ప్రారంభమైన కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి మొత్తం 18 మంది హాజరయ్యారు.వీరిలో ఎమ్మెల్యే వర్గం నుండి ఎమ్మెల్యేతో కలిపితే 16 మంది హాజరయ్యారు.ఎంపీ బైరెడ్డి శబరి వర్గం నుండి ప్రస్తుత మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు పట్టణంలో 29 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 20 మంది కౌన్సిలర్లు హాజరైతేనే మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి కానీ 18 మంది మాత్రమే రావడంపై కోరం లేకపోవడంతో వీటిని ఆత్మకూరు ఆర్డీవో డి నాగజ్యోతి వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీ వర్గం నుండి మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. వైసీపీ నుండి ఇద్దరు కౌన్సిలర్లు హాజరు కాలేదు.మున్సిపాలిటీ చైర్మన్ గా సుధాకర్ రెడ్డి కొనసాగరన్నారు.పట్టణంలో సుధాకర్ రెడ్డి వర్గం టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బెరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటిదగ్గర చైర్మన్ మరియు కౌన్సిలర్లతో కలసి బైరెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ కోరం లేకపోవడంతో మళ్లీ తేదీని ప్రకటిస్తామని ఆర్డీవో చెప్పారని ఎమ్మెల్యే అన్నారు.కోరం లేకపోవడంతో ఏకగ్రీవంగా మళ్ళీ నన్ను సంవత్సరం వరకు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా రూల్స్ ఉన్నాయని చైర్మన్ సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలో ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో సిఐలు సుబ్రహ్మణ్యం,ప్రవీణ్ కుమార్ రెడ్డి,సురేష్ కుమార్,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.