ఘనంగా భారత రాజ్యాంగ సంవిధాన్ దివస్ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ , కర్నూలు: కర్నూలు బుధవార పేటలోని వైసీపీ కార్యాలయంలో 72వ భారత రాజ్యాంగ సంవిధాన్ దివస్ వేడుకలు నల్లారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాదరాపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాదరాపు కేదార్ నాథ్ మాట్లాడుతూ భారత్ కరెన్సీపై అంబేద్కర్ చిత్రపఠం ముద్రించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలను కోరారు. నవంబర్ 26, 72వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించామన్నారు. 1940లో భారత రాజ్యాంగం రచన కోసం కమిటీ వేయగా భారత స్వాతంత్ర్యం 1947లో వచ్చినప్పటికీ పూర్తి కాలేదు. ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కమిటీలో నియమించగా కేవలం రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులులోనే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి, 26 నవంబర్ 1949లో పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లారెడ్డి ఫౌండేషన్ సభ్యులు జేశ్వంత్,వసంత్,ఆంధ్రప్రదేశ్ ప్రయివేటు లెక్షరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమృత్,కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ చాట్ల నవీన్,అదిశేషు, సాయి, అరుణ్,తదితరులు పాల్గొన్నారు.