PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ వేడుకల్లో..ప్రముఖులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా  రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం మట్లి గ్రామ సర్పంచ్ సోమారపు నాగార్జున ఆచారి  కుమార్తె హర్షిత వివాహ వేడుకలు బుధవారం రాయచోటి టౌన్ లోని అభి కన్వెన్షన్ హాలులో జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి అతిరధ మహారధులు  హాజరయ్యారు. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక  కార్యక్రమాలు  ప్రత్యేక ఆకర్షణీయంగా  ఆలరించాయి.ఈ కార్యక్రమంలో  రాజంపేట ఎం ఎల్ ఏ  మేడా మల్లికార్జున రెడ్డి,మాజీ ఎం ఎల్ ఏ, రామేష్  కుమార్ రెడ్డి, మాజీ ఎం ఎల్ సీ బత్యాల చెంగల్ రాయుడు ,మాజీ టి టి డి  పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు,    టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్  రాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దీవించారు. ఈయన వెంట టిడిపి నాయకులు గుదె నాగభూషణం, నందకుమార్ నాయుడు, ఎన్ఆర్ఐ టిడిపి నేత గుదె నాగార్జున చౌదరి, రత్నమాచారి, బండి రమణయ్య, అనిల్, రామక్రిష్ణమ రాజు, బండి గిరివర్థన్, అశోక్, మహేంద్ర రాజు, వీరబల్లి ప్రింట్ మీడియా మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

About Author