ప్రముఖులకు శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం….
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: శ్రీ రామాలయం “శతాబ్ది బ్రహ్మోత్సవాలు” లో భాగంగా ఈరోజు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ టి.జీ. భరత్ ని అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీ.జీ. వెంకటేష్ ని, కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు ని చైత్ర శుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీ నుండి చైత్ర బహుళ సప్తమి ఏప్రిల్ 18 వ తేదీ వరకు జరిగే 100 సం.ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సాధారంగా ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు చిల్కూరు ప్రభాకర్,కోశాధికారి చిల్కూరు నందకిశోర్,మాజీ కార్పోరేటర్ విఠల్ శెట్టి, ఆలయ ప్రధాన అర్చకులు మాళిగి హనుమేషాచార్య, వ్యాసరాజ్, సమితి సభ్యులు యస్. ప్రాణేష్,మాళిగి భానుప్రకాష్ , నీలి నరసింహ, మామిళ్ళపల్లి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
