శ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
1 min readపల్లెవెలుగు,ఏలూరు: కృష్ణా జిల్లా,కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న జాతర మహోత్సవంలో భాగంగా 11 వ రోజు ఆదివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.ఈ రోజు ఉదయం గం. 5.00ల నుండి గం.6.00 ల వరకు విఘ్నేశ్వరపూజ,పుణ్యహవచన, శ్రీ చక్రార్చన, మరియు నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ,ధూపసేవ, బాలభోగం,హారతి కార్యక్రమం దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు శ్రీ పెటీటి పరమేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగినవి అనంతరం ఉచిత ప్రసాద వితరణ జరిగినవి.ఈ రోజు అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ మరియు ఉచిత ప్రసాదం చేయించిన దాతలు కోళ్ళపర్రు వాస్తవ్యులు శ్రీ కనుమూరి రంగరాజు. వారి శ్రీమతి నాగపార్వతి, గార్లను ఆలయ కార్యనిర్వాహణాధికారి వారికి పుష్పమాలలతో శేషవస్త్రములతో సత్కరించి అనంతరం తీర్థ ప్రసాదములు అందచేసినారు.ఈరోజు అమ్మవార్లను దర్శించుకున్న వారు గౌరవనీయులు దూలం నాగేశ్వరరావు (DNR) శాసన సభ్యులు కైకలూరు, డి.సత్యానందం, DSP గుడివాడ వారి దంపతులు, గుమ్మడివెంకటేశ్వరావు,మార్కెట్ యార్డ్ చైర్మన్ కైకలూరు వారి దంపతులు, రామిశెట్టి సత్యనారాయణ,MPP ముదినేపల్లి వారి కుటుంబ సభ్యులు,S. చంద్రశేఖర్, సహాయ కమిషనర్ దేవదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు వారి కుటుంబ సభ్యులు మరియు చల్లా.కృష్ణా,S.I. కైకలూరు వారి కుటుంబ సభ్యులతో శ్రీ అమ్మవర్ల దర్శనర్ధమై విచ్చేసియున్నారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాలరావు అతిధి మర్యాదలతో వారికి విశేష పూజలు జరిపించి పుష్పమాలలతో శేషవస్త్రములతో సత్కరించి అనంతరం తీర్ధ ప్రసాదములు అందచేసినారు.దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత పందిర్లలో భక్తులు వంటలు పాలపొంగళ్ళు చేసుకున్నారు. సర్కారు కాలువ నుండి దేవాలయం వరకు గోకర్ణపురం నుండి దేవాలయం వరకు నీళ్ళ ట్యాంకర్లతోరోడ్లుతడిపించినారు. భక్తులకు ఏ విదమైన అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పులవర్తి లక్ష్మణ్ రావు మరియు ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో ముందస్తుగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని, జాతర ఉత్సవముల 16 రోజుల సాయంత్రం గం.5 ల నుండి సహస్రనామార్చన మరియు ధూపసేవ, పంచహారతుల, ఉచిత ప్రసాదం కార్యక్రమం జరుగును.రాత్రి గం.7.00 లకు భుజబలపట్నం విద్యార్థులచే మురళి కోలాట ప్రదర్శన జరిగినవి అని ఆలయ కార్యనిరాహణాధికారి కె.వి. గోపాలరావు ప్రకటనలో తెలియజేశారు.