NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`రాధేశ్యామ్` ఎలా ఉందో చెప్పిన సెన్సార్ స‌భ్యుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాధేశ్యామ్ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు ప్ర‌ముఖ సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధూ. సెన్సార్ కార్య‌క్ర‌మంలో భాగంగా రాధేశ్యామ్ చిత్రాన్ని ఉమైర్ సంధూ చూశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘అసలు సిసలైన సినిమా ‘రాధేశ్యామ్’. ముఖ్యంగా ముఖ్యంగా క్లైమాక్స్ సరికొత్తగా ఉంది. సినిమా మొత్తానికది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గ్రాఫిక్స్ ను ఉపయోగించుకున్న విధానం అమోఘం. ప్రభాస్, పూజా కెమిస్ట్రీకి ఒంట్లో కరెంట్ ప్రవహిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎవరూ తీయని మిస్టరీ సబ్జెక్ట్ తో ‘రాధేశ్యామ్’ తెరకెక్కించారు. క్లాస్ అండ్ స్టైల్ లో ప్రభాస్ ను కొట్టే మొనగాడు ఇండియాలో మరెవరూ లేరు. ఈ సినిమాలో ఆయన అత్యంత ఆకర్షణీయంగా కనిపించారు. అతడి నటన, ఆహార్యం నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి’ అంటూ ఉమైర్ సంధు ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు.

                              

About Author