అగ్నిపథ్ పై కేంద్రం దిద్దుబాటు చర్యలు !
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రిజర్వేషన్‌కు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, సివిల్ డిఫెన్స్ పోస్టులతో పాటు 16 విభాగాల్లో రిజర్వేషన్‌ను వర్తింపజేయనుంది. త్వరలోనే నియామక నిబంధనల్లో మార్పులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది కేంద్ర రక్షణ శాఖ. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఇదివరకే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు హోంశాఖ స్పష్టం చేసింది.