కేంద్రం సంచలన నిర్ణయం: 15 వరకు మూసివేత
1 min readపల్లెవెలుగు వెబ్: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో పర్యాటకుల ఆరోగ్యం దృష్ట్యా నేటి నుంచి మే 15వ తేదీ వరకు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని, చారిత్రక ప్రదేశాలు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చారిత్రక ప్రాంతాలు చార్మినార్, గోల్కొండ కోటలో సందర్శకులను అనుమతించరు. కాగా రాష్ట్ర పరిధిలోని మ్యూజియాలు, ఇతర పర్యాటక ప్రాంతాల సందర్శన కొనసాగించనున్నారు. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతన్నాయి. నిన్న ఒక్కరోజే 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 1185 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం అయింది. రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ విధించే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.