అవసరమైతే కేంద్రం కరెన్సీ ముద్రించాలి: చిదంబరం
1 min readన్యూఢిల్లీ: ప్రభుత్వ ఖర్చులకు అవసరమైతే తగినంత కరెన్సీని కేంద్రం ముద్రించవచ్చని కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ”తప్పనిసరి అయితే ఖర్చుల కోసం కేంద్రం కరెన్సీ ముద్రించుకోవచ్చు. అందుకు అవసరమైన సార్వభౌమాధికార హక్కు మనకు ఉంది. మరీ ఎక్కువగా ముద్రించేసామని ప్రభుత్వం అనుకుంటే, ప్రింటింగ్ ఎప్పుడైనా ఆపేయవచ్చు” అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇప్పటికిప్పుడు అయితే కరెన్సీ ప్రింట్ చేయడం సరైన చర్యగా తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇదే ఆలోచనను డాక్టర్ అభిజిత్ బెనర్జీ సైతం వ్యక్తం చేశారని, పలువురు ఆర్థిక వేత్తలు కూడా ప్రభుత్వం తమ ఖర్చులను తట్టుకునేందుకు కరెన్సీ ప్రింట్ చేయడం తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.