ధరలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సిపిఎం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సిపిఎం పార్టీ మండల నాయకులు ఓబులేష్ అన్నారు.మంగళవారం మిడుతూరు మండల కేంద్రమైన సిపిఎం పార్టీ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమర భేరి అనే పోస్టర్లను ఓబులేసు మరియు వ్యకాస మండల నాయకులు లింగస్వామి పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈనెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని గ్రామాలలో రైతులను చైతన్యవంతం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు విద్యుత్ చార్జీలు పెంచుతూ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.ప్రతి గ్రామ సచివాలయంలో వినతి పత్రాలను అందజేయడం జరుగుతూ ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు హద్దు అదుపు లేకుండా పెంచుతున్నారని మరియు పెట్రోల్ డీజిల్ గ్యాస్ తదితర వాటి ధరలను విపరీతంగా పెంచాలని ధరలు తగ్గించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చందాయని ప్రభుత్వాలు ధరలు పెంచుట గురించి గ్రామాల్లో రైతులకు వివరిస్తూ వారిని చైతన్యం పరుస్తూ సెప్టెంబర్ 4వ తేదీన మిడుతూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి భారీ ధర్నా చేపడుతున్నట్లు ఓబులేష్, లింగస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు శివరాం తదితరులు పాల్గొన్నారు.