కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్క్వే మార్షల్ ఆర్ట్స్ వల్ల క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగరంలోని కోల్స్ కళాశాలలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారుల అభినందన సభలో ఆయన పాల్గొని క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి.. ఏదైనా సాధించే శక్తి వస్తుందన్నారు. ముస్లింలు కూడా ముందుకు వచ్చి తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా చేయడం చాలా అభినందించదగ్గ విషయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే బాగా రాణిస్తారని చెప్పారు. తమ టీజీవి సంస్థల తరుపున క్రీడాకారులకు అన్ని రకాల అండగా ఉంటామని అన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, ఉస్మానియా కాలేజీ ప్రిన్సిపల్శామీరుద్దీన్, అధ్యాపకులుఅన్వర్ హుస్సేన్, మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ కార్యదర్శి నవీ సాహెబ్, నారాయణ విద్యాసంస్థల కోఆర్డినేటర్ ఖనా కార్టూన్, జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం వ్యవస్థాపకులు గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.