కేంద్ర బడ్జెట్ ను సవరించాలి… డి రాజా సాహెబ్
1 min read
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను కేంద్ర బడ్జెట్ లో పొందుపరచాలని….. వామపక్షాల ధర్నా
పల్లెవెలుగు ,పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులకు శాపంగా బడా పెట్టుబడుదారులకు వరంగా ఉన్న బడ్జెట్ను సవరించాలని మరియు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను పొందుపరచాలని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇవ్వాలని బుధవారం పత్తికొండలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల వరకు ప్రదర్శన అనంతరం అక్కడ నిరసన ధర్నా చేపట్టారు. ధర్నాకు సిపిఐ మండల సహాయ కార్యదర్శి హెచ్ రంగన్న సిపిఎం నాయకులు సురేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారుగా ముందుకు పోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 8 వ సారి 50 లక్షల 65,345 కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పుడప్పుడు విభజన హామీలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారన్నారు, కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజీ పై కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం విచారకరమని వారు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో వేతన జీవులపై విధించే పన్ను విధానంలో స్లాబుల రూపంలో ఊరట కల్పించినప్పటికీ పరోక్ష పన్నుల ద్వారా దోపిడీకి ద్వారాలు తెరిచిందన్నారు.