సమ్మెకు సై అన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు !
1 min read
పల్లెవెలుగువెబ్ : కొత్త పింఛన్ పథకం ఉపసంహరణ, అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని వంటి 13 డిమాండ్లతో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 28,29 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మహా సమ్మేళనం విడుదల చేసిన ప్రకటనలో, 18 నెలల అలవెన్స్ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆరోపించింది. కొత్త పింఛన్ పథకం విరమించుకోవాలని, ఎల్‌ఐసీ, బ్యాంకులతో పాటు ప్రజా శాఖల ప్రైవేటీ కరణ ఉపసంహరించుకోవాలని కోరుతూ రెండు రోజులు దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటనలో తెలిపింది.