చేనేత హస్తకళలకు కేంద్ర ప్రభుత్వం చేయూత : టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ :చేనేత హస్తకళలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఎంతో సహకారాన్ని అందిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక నంద్యాల చెక్పోస్ట్ నందు ఉన్న దేవి ఫంక్షన్ హాల్ నందు కళాభారతి చేనేత, హస్తకళల మేళాను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చేనేత, హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక చేనేత, హస్తకళల అభివృద్ధికి ఎంతో చేయూతనిస్తూ, వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ప్రజలు కార్పొరేట్ సంస్థలు చేసే ప్యాకింగ్ లు చూసి మోసపోతూ, అనవసరంగా డబ్బును వృధా చేసుకుంటున్నారని, నిజానికి చేనేత హస్తకళలతో చేసినవి వాటికంటే ఎంతో నాణ్యతగా ఉంటూ, అతి తక్కువ ధరలలొనే ఉంటాయని టీజీ తెలిపారు. చేనేత హస్తకళల మీద ఆధారపడి కోట్లాది కుటుంబాలు ఉన్నాయని, వాటిని ప్రజలు ప్రోత్సహిస్తూ వారిని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని టీజీ వెంకటేష్ అన్నారు . ఈ కార్యక్రమంలో కళాభారతి కోఆర్డినేటర్లు కిషోర్, సత్యనారాయణ, సముద్రాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.