PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ కార్యక్రమం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడుస్థానిక లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం యెక్క నీతి అయోగ్ ద్వారా నిర్వహించబడుతున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ నందు ఈరోజు కమ్యూనిటీ ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించబడినది.విద్యార్థులు 10 సైన్స్ ప్రాజెక్టులు తయారు చేశారు.ఇందులో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.8,9,10 వ తరగతి విద్యార్థులు చక్కని ప్రాజెక్టులు తయారు చేశారు.జడ్జ్ లుగా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి శ్రీ రమణయ్య , మెకానికల్ ఇంజనీర్ శ్రీ ఫరూక్  ఐటిఐ కాలేజికి సంబంధించిన లెక్చరర్స్ మూడు ప్రాజెక్టులు సెలక్ట్ చేశారు.మొదటి బహుమతి స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ గ్రూప్,రెండవ బహుమతి ఆటోమేటిక్ రైల్వేగేట్ గ్రూప్ ,మూడవ బహుమతి స్మార్ట్ సానిటైజర్ గ్రూప్ వారు పొందారు.ఇంకా బెస్ట్ సైన్స్ స్టూడెంట్ అవార్డ్ మరియి ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేశారు.పాఠశాల కరస్పాండెంట్ డా..యం యఫ్ ఇమ్మానియేల్  ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో అటల్ ఫెస్ట్ ,అటల్ ఆన్ వీల్ అనే కార్యక్రమాలను ఈ అటల్ సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులతో నిర్వహించి అనేక మంది విద్యార్థులకు సైన్సు ప్రాధాన్యతను వివరిస్తామని తెలిపారు.అలాగే సహకారం అందించిన ప్రో సోల్ మైండ్స్ ఫయాజ్ ని మెంటార్స్ రియాజ్ ,ఫయాజుద్దీన్ వారిని మరియి  అటల్ ఇన్ చార్జ్ అనిల్ సార్ ని ,ప్రకాషం సార్ ని ,జోసఫ్ రిచర్డ్సన్ ని ,పాఠశాల ఉపాధ్యాయిలను అభినందించారు. ఈ కార్యక్రమ ము ముఖ్య వ్యక్తులు అయిన అటల్ ప్రిన్సిపాల్ శ్రీమతి అఫ్ఫియా ప్రశాంత ప్రతి విద్యార్థిని మరియు కార్యనిర్వాహకులను అభినందించారు.

About Author