సివిల్స్ అదనపు అటెంప్ట్స్ పై కేంద్రం స్పష్టత
1 min read
పల్లెవెలుగువెబ్ : సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అదనపు అటెంప్ట్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి, ఇతరత్రా ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.