ఫైర్ ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వినియోగిస్తున్న యూజర్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్) మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో పలు భద్రతా లోపాలను కనుగొన్నట్లు తెలిపింది. ఈ భద్రతా లోపాల వల్ల యూజర్ అనుమతి లేకుండానే కీలక సమాచారాన్ని హ్యకర్ చేతికి చెరవేస్తున్నట్లు సీఈఆర్ టీ-ఇన్ పేర్కొంది. తాజాగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 98 అప్‌డేట్‌కు రాకముందు.. అన్ని మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్‌లు ఈ భద్రతా లోపాలతో ప్రభావితమైనట్లు భద్రతా ఏజెన్సీ వెల్లడించింది. పైర్ ఫాక్స్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.