NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

1 min read

పల్లెవెలుగు వెబ్​: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. శనివారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.19, డీజిల్ ధర లీటరుకు 92.17 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ముంబైలో పెట్రోల్‌ ధర వంద రూపాయలు దాటడం ఇదే మొదటిసారి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.94, డీజిల్‌ రూ.84.89. దేశంలో మే4 నంచి పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది 15వ సారి.
► హైదరాబాద్ లీటర్‌ పెట్రోల్‌ రూ. 97.63, డీజిల్‌ రూ. 92.54
► కోల్‌కతా లీటర్‌ పెట్రోల్‌ రూ. 93.97, డీజిల్‌ రూ. 87.74
► చెన్నై లీటర్‌ పెట్రోల్‌ రూ. 95.51, డీజిల్‌ రూ. 89.65
► బెంగళూరు లీటర్‌ పెట్రోల్‌ రూ. 97.07, డీజిల్‌ రూ. 89.99

About Author