NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ సేవకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు విధినిర్వహణలో మెరుగైన పనితీరుకు గుర్తింపుగా జిల్లా వ్యాప్తంగా పలువురు అధికారులకు నంద్యాల.కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. గడివేముల మండలం నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న . యెల్ల సుబ్బయ్య, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం సహాయ ఇంజనీరు పవన్ కుమార్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వెంకటపతి ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

About Author