ఉత్తమ సేవకు ప్రశంసా పత్రం
1 min read– జిల్లాను అన్ని రకంగాలలో ప్రగతి పథంలో ఉంచేందుకు అధికారులు పునరాంకితం కావాలి..
– ఏలూరు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
– మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ …విజయరాజుకు ప్రశంసా పత్రం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలర్పించిన ఎందరో త్యాగమూర్తుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాను అన్ని రంగాలలో ప్రగతిపథంలో ఉంచేందుకు అందరం పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న ప్రగతిపై కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 74 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరం వారు స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దానిలో భాగంగా రవాణా శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఏలూరు జిల్లా. ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయరాజుకు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ , జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని విజయరాజు అందుకున్నారు, ఈయన సుదీర్ఘకాలం పలు ప్రదేశాల్లో పనిచేసి అధికారులచే ఆమాత్యులచే. మచ్చలేని అధికారిగా ప్రశంసలు అందుకున్నారు. పలువురు ఉద్యోగస్తులు తోటి సిబ్బంది హర్షదనాలతో విజయరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.