గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ .. టీకా అభివృద్ధి చేసిన `సీరం` !
1 min readపల్లెవెలుగువెబ్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షణ కల్పించగల వ్యాక్సిన్‌ను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. దీని పేరు ‘క్వాడ్రివాలెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్’ (క్యూహెచ్‌పీవీ) టీకా. దీనితో నిర్వహిస్తున్న రెండు, మూడోదశ ప్రయోగ పరీక్షలు ముగియగానే.. టీకాను ఉత్పత్తి చేసి, నిల్వ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ‘సీరం’ దరఖాస్తు సమర్పించింది. అనుమతులన్నీ పొంది, క్యూహెచ్‌పీవీ టీకా ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో ఐదారు నెలలు పట్టొచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.